బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ వార్: రంగంలోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్!
Bigg Boss Telugu 9 Day 50 బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లో 50వ రోజు నామినేషన్స్ ప్రక్రియ అగ్గి రాజేసింది. ఈ వారం నామినేషన్స్‌కు బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇంటి నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ప్రియ, శ్రీజ, మర్యాద మనీష్, ఫ్లోరా హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చి, మిగిలిన ఇంటి సభ్యులను నామినేట్ చేశారు.
ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌కు స్పెషల్ పవర్: బిగ్ బాస్ వారికి రెండు కత్తులను ఇచ్చారు. ఒక కత్తి నామినేట్ చేయడానికి, మరొక కత్తి తమకు నచ్చిన సభ్యుడికి నామినేషన్ పవర్‌ను అప్పగించడానికి ఉపయోగపడుతుంది.
Bigg Boss Telugu 9 Day 50 నామినేషన్స్‌లో హైలైట్స్:
- ప్రియ vs సంజన: ప్రియ రాగానే సంజనను టార్గెట్ చేసింది. హౌస్‌లో బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతున్నారని, దివ్యను ఉద్దేశించి “రోడ్ రోలర్”లా ఉందని చేసిన వ్యాఖ్యలు ఫన్నీగా లేవని, చాలా బాధ కలిగిస్తాయని ప్రియ నిలదీసింది. సంజన తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయగా, ఎదుటి వారిని అలా మాట్లాడటం తప్పు అని ప్రియ ఖండించింది.
- మర్యాద మనీష్ vs కళ్యాణ్: మర్యాద మనీష్.. కళ్యాణ్‌ను తప్పు పట్టాడు. ఇమ్మానుయేల్ నమ్మి ఇచ్చిన నామినేషన్ పవర్‌ను కళ్యాణ్ ఉపయోగించుకోకుండా సంజనను నామినేట్ చేసి వెన్నుపోటు పొడిచాడని మనీష్ ఆరోపించాడు. దీనికి ఇమ్మానుయేల్ కూడా కల్పించుకుని కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చాడు.
- ఇమ్మానుయేల్ vs తనూజ: ఇమ్మానుయేల్ తనూజను నామినేట్ చేశాడు. బొమ్మల గేమ్‌లో తనూజ తన కోసం ఆడినా, ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి రాముకు ఓటేసి మైండ్ పోగొట్టిందని ఆరోపించాడు. తనూజ తాను చేసింది కరెక్టేనని వాదించినా, ఇమ్మానుయేల్ ఆమె రెండు నాలుకల ధోరణిని ఎత్తి చూపడంతో తనూజ తడబడింది.
- కళ్యాణ్ vs రాము: కెప్టెన్ కాలేకపోయావని కళ్యాణ్, రాముని నామినేట్ చేయగా, నువ్వు కూడా కాలేదనే పంచ్ ఇచ్చి రాము హీట్ పెంచాడు.
చివర్లో మర్యాద మనీష్ “ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారు” అంటూ ఫైనల్ టచ్ ఇచ్చాడు. మొత్తానికి, ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల రాకతో నామినేషన్స్ ప్రక్రియ మరింత రసవత్తరంగా మారింది.
బిగ్ బాస్ మరో ట్విస్ట్: ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో కొంతమంది మళ్లీ ఇంటి సభ్యులుగా మారి, మిగిలిన వారితో పాటు ట్రోఫీ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నారంటూ బిగ్ బాస్ ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చి మరింత ఆసక్తిని పెంచారు.
Bigg Boss Telugu 9 Day 50
SBI Card Festive Offers 2025: ఖుషియాన్ అన్‌లిమిటెడ్ తో డిస్కౌంట్
