Bigg Boss Telugu Season 9

Bigg Boss Telugu 9 Controversy – కామన్‌మాన్ హరీష్ డైలాగ్: శివుడు రాముడు కంటే నేనే గ్రేట్!

magzin magzin

హరీష్ మాటలు = ట్రాఫిక్ జామ్

Bigg Boss Telugu నేను శివుడికంటే గొప్పోడ్ని” అని ఒక్క మాట వేశాడంటే చాలు, హౌస్ మొత్తం అయ్యో ఇది ఏం వింటున్నామురా! అనే లుక్ ఇచ్చేసింది.

బయట పబ్లిక్‌కి అయితే ఇది కబురుకాదు, బంగారం. సోషల్ మీడియాలో మీమ్స్ మంటలు ఎగురుతున్నాయి.


Bigg Boss Telugu దేవుళ్లను కూడా లాగేశాడు!

హౌస్‌లో ఫ్రస్ట్రేషన్ ఉంటే వాసన బయటికి వస్తుంది. కానీ హరీష్ గారు ఏం చేశారు? నేరుగా దేవుళ్లపైనే మాటలు పేల్చేశాడు. రాముడు, శివుడు… ఎవ్వరినీ వదలలేదు. ఇది అంటే బిగ్ బాస్ హౌస్‌లో మిర్చి పొడి నేరుగా పాన్‌లో వేసినట్టే కదా …


కంటెస్టెంట్లు = స్టాచ్యూలు

ఇమ్మానుయేల్, భరణి & కో… వీళ్ల రియాక్షన్స్ చూడటానికి టీవీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, స్తంభాల్లా నిలబడ్డారు. ఒకరికి ఒకరు “అదీంట్రా రా?” అన్నట్టు చూపులు విసురుతుంటే, కెమెరా మాత్రం బంగారం పట్టేసింది.


Bigg Boss Telugu సోషల్ మీడియా సడన్ ఎగ్జామ్

బయట నెటిజన్లు కీబోర్డ్స్‌తో ఫుల్ ఫైర్‌లోకి వెళ్లారు. కానీ ఎవరో “హరీష్ = కామన్‌మాన్ కాదు, కామెంట్‌మాన్” అన్నారు. మరికొందరు “అతనిని వెంటనే గుడి గోడల దగ్గరకి షిఫ్ట్ చేయండి, అక్కడే డైలాగులు ప్రాక్టీస్ చేయించండి” అంటున్నారు.


పబ్లిక్ సైడ్

ప్లీజ్, పబ్లిక్ ఎమోషన్స్ కూడా లైట్‌గా తీసుకోకూడదు.కానీ ఎవరో నవ్వుతున్నారు, ఎవరో సీరియస్‌గా బావిస్తున్నారు. “రాముడు శివుడు గురించి ఇలా మాట్లాడటం సరదా కాదు” అంటున్నారు. కానీ… బిగ్ బాస్ షోలో కాంట్రవర్సీ = TRP అన్న సూత్రం మళ్లీ రుజువైంది.


హరీష్ అజెండా

హరీష్ మాటల్లో నిజంగానే ఆత్మవిశ్వాసమా? లేక “కెమెరా నన్నే చూసుకోవాలి” అన్న అజెండా? ఆ ప్రశ్నకి సమాధానం బిగ్ బాస్ హౌస్ గోడలకే తెలుసు. కానీ ఒకటి మాత్రం ఖాయం — ఈ కామన్‌మాన్ హౌస్‌లోని సైలెన్స్‌ని రోడ్డు జాతరగా మార్చేశాడు అంతే కదా ..

Bigg Boss Telugu Season 9 – బిగ్ బాస్ 9లో కామనర్లు vs సెలబ్రిటీలు, నాగార్జున హోస్ట్‌గా మళ్ళీ హంగామా!

Follow On : facebook twitter whatsapp instagram