Sonal Chauhan in Mirzapur Movie సినీ కెరీర్‌లో సరైన హిట్లు లేక ఇబ్బందుల్లో ఉన్న నటి సోనాల్ చౌహాన్‌కి ఓ గొప్ప అవకాశం దక్కింది. సంచలనాత్మక వెబ్ సిరీస్ **’మీర్జాపూర్’**ను సినిమాగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ను హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ దక్కించుకుంది.
ఈ విషయాన్ని ఆమె ఈరోజు (అక్టోబర్ 27) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. “అద్భుతమైన, గేమ్ ఛేంజింగ్ జర్నీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నా. మీర్జాపూర్ యూనిట్‌లో చేరేందుకు ఎక్సైటింగ్‌గా ఉన్నా” అని సోనాల్ పోస్ట్ చేసింది.
బోల్డ్ సీన్లు, మాటలతో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు సీజన్లు వచ్చి, అన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి.

తెలుగులో సోనాల్ చౌహాన్ గతంలో ‘రెయిన్ బో’, ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’, ‘రూలర్’, ‘ఎఫ్3’, ‘ది ఘోస్ట్’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాల్లో నటించింది.
Sonal Chauhan in Mirzapur Movie
Hyderabad Weather Report | వాతావరణం – వర్షం, ట్రాఫిక్, మీమ్స్ అన్నీ కలిపిన మసాలా
