OG OTT Release Date
OG OTT Release Date పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత, ఈ చిత్రం నెల రోజులు తిరగకముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినప్పటికీ, అభిమానులు ఈ చిత్రం ఫలితంతో సంతోషంగా ఉన్నారు.
ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగియడంతో, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
Bigg Boss 9 Telugu Day 39 మాధురి నోటికి రీతూ కళ్లెం…
