Diwali OTT Releases ఈ వారం ఓటీటీ రిలీసులు
Diwali OTT Releases దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్‌లో సినీ సందడి ఊపందుకుంది. థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటీటీలో సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ‘కిష్కింధపురి’, ‘దక్ష’, ‘ఆనందలహరి’, ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్’ వంటి చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్‌లలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ దీపావళి వీకెండ్‌లో 40కి పైగా సినిమాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
ఈ ఫెస్టివల్ సీజన్‌లో థియేటర్లలో ‘మిత్ర మండలి’, ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’, ‘K-ర్యాంప్’ వంటి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుండగా, ఓటీటీలోనూ బ్లాక్‌బస్టర్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి.
Diwali OTT Releases బెల్లంకొండ కిష్కింధపురి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కిష్కింధపురి’ హారర్ థ్రిల్లర్ చిత్రం. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 19న సాయంత్రం జీ టీవీలో కూడా ప్రసారం కానుంది.
మంచు వారి దక్ష
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో, మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటించిన ‘దక్ష’ చిత్రం వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో రూపొందింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
Diwali OTT Releases దగ్గుబాటి వారి ఆనందలహరి
సురేష్ ప్రొడక్షన్స్ మినీ సమర్పణలో రూపొందిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘ఆనందలహరి’. అభిషేక్ బొడ్డేపల్లి, భ్రమరాంబికా టుటిక ప్రధాన పాత్రల్లో నటించగా, సాయి వనపల్లి దర్శకత్వం వహించారు. ప్రవీణ్ ధర్మపురి నిర్మాతగా వ్యవహరించారు. దీపావళి కానుకగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఫైనల్ డెస్టినేషన్’ ఫ్రాంఛైజీలో ఆరో చిత్రం ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్’. సుమారు రూ.430 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.2400 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల ఆడియోలతో స్ట్రీమింగ్ అవుతోంది.
Diwali OTT Releases ఇతర ఓటీటీ రిలీసులు
నెట్‌ఫ్లిక్స్
- ది ట్వీట్స్ (మూవీ) – ఇంగ్లీష్/తెలుగు
- గ్రేటర్ కాలేష్ (మూవీ) – హిందీ/తెలుగు/ఇంగ్లీష్
- షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ (మూవీ) – ఇంగ్లీష్/తెలుగు
- థామస్ అండ్ ఫ్రెండ్స్: సోదోర్ సైన్స్ టు గెదర్ (మూవీ) – ఇంగ్లీష్
- 27 నైట్స్ (మూవీ) – ఇంగ్లీష్/స్పానిష్
- గుడ్ న్యూస్ (మూవీ) – కొరియన్/ఇంగ్లీష్
- ఎవ్రీబడీ లవ్స్ మి వెన్ ఐ డెడ్ (మూవీ) – థాయ్
- ది పర్‌ఫెక్ట్ నైబర్ (డాక్యుమెంటరీ) – ఇంగ్లీష్/హిందీ
- స్పిప్లంటర్ సెల్: డెత్ వాచ్ (వెబ్ సిరీస్) – ఇంగ్లీష్
- ది డిప్లొమ్యాట్ 3 (వెబ్ సిరీస్) – ఇంగ్లీష్
- టర్న్ ఆఫ్ ది టైడ్ 2 (వెబ్ సిరీస్) – పోర్చుగీస్
- రొమాంటిక్స్ అనానమస్ (వెబ్ సిరీస్) – జపనీస్
- పాసింగ్ ది రెయిన్స్ (వెబ్ సిరీస్) – జపనీస్
జియో హాట్‌స్టార్
- హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (మూవీ) – ఇంగ్లీష్/తెలుగు
- ది నైబర్‌హుడ్ 8 (వెబ్ సిరీస్) – ఇంగ్లీష్
- ది చెయిర్ కంపెనీ 5 (వెబ్ సిరీస్) – ఇంగ్లీష్
- ఘోస్ట్స్ 5 (వెబ్ సిరీస్) – ఇంగ్లీష్
- ఎల్స్‌బెత్ 3 (వెబ్ సిరీస్) – ఇంగ్లీష్
- మర్దాగ్: డెత్ ఇన్ ది ఫ్యామిలీ (వెబ్ సిరీస్) – ఇంగ్లీష్
అమెజాన్ ప్రైమ్ వీడియో
- బాఘీ 4 (మూవీ) – హిందీ (పే పర్ వ్యూ)
- అందోందిత్తు కాలా (మూవీ) – కన్నడ
- పరన్ను పరన్ను పరన్ను చెల్లన్ (మూవీ) – మలయాళం
- ది రూల్ ఆఫ్ జెన్నీ పెన్ (మూవీ) – ఇంగ్లీష్
- ఫియర్ బిలో (మూవీ) – ఇంగ్లీష్
- ఫాలోయింగ్ (మూవీ) – కొరియన్/ఇంగ్లీష్
- హిట్‌మ్యాన్ 2 (మూ�వీ) – కొరియన్/ఇంగ్లీష్
- హాట్ బ్లడెడ్ (మూవీ) – కొరియన్
- అవర్ ఫాల్ట్ (మూవీ) – స్పానిష్
- సినోత్రోపి (మూవీ) – జపనీస్
- హాలీవుడ్ హస్లర్: గ్లిట్జ్ గ్లామ్‌స్కామ్ (డాక్యుమెంటరీ సిరీస్) – ఇంగ్లీష్
జీ5
- అభ్యంతర కుట్టవాలి (మూవీ) – మలయాళం
- ఎలుమేల్ (మూవీ) – కన్నడ
- మేడమ్ సేన్ గుప్త (మూ�వీ) – బెంగాలీ
- భగవత్ చాప్టర్ 1: రాక్షస – హిందీ
ఆపిల్ టీవీ+
- లూట్ 3 (వెబ్ సిరీస్) – ఇంగ్లీష్
- మిస్టర్ సూర్సే (డాక్యుమెంటరీ సిరీస్) – ఇంగ్లీష్
ఇతర ప్లాట్‌ఫామ్‌లు
- ఈటీవీ విన్: ఒక మంచి ప్రేమకథ (మూవీ) – తెలుగు
- ఆహా: చెన్నై ఫైల్స్: ముక్తల్ పక్కమ్ (మూవీ) – తమిళ్
- సన్ నెక్ట్స్: ఇబమ్ (మూవీ) – మలయాళం
Bigg Boss 9 Telugu Day 39 మాధురి నోటికి రీతూ కళ్లెం…
