Bigg Boss 9 Day 54 Promo బిగ్ బాస్ హౌస్‌లో తనూజ గౌడ, కళ్యాణ్ పడాల మధ్య పెద్ద గొడవ జరిగింది. తనూజ ఓవరాక్షన్ తట్టుకోలేకపోయిన కళ్యాణ్ ఈసారి గట్టిగా బదులిచ్చాడు.
వివరాలు: Bigg Boss 9 Day 54 Promo
- తనూజ వర్సెస్ కళ్యాణ్: బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడల్లా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఈ వారం మొత్తం వంటగది చుట్టూ చిన్నపాటి యుద్ధాలు జరిగాయి. ఫుడ్ తీసుకుంటే “నాకు చెప్పలేదు” అంటుంది, అడిగితే “కుదరదు పెట్టను” అంటుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కళ్యాణ్, తనూజతో గొడవపడ్డాడు.
- గొడవకు కారణం: రాత్రికి బెండకాయ కూర వద్దు అని కెప్టెన్ ఇమ్మూతో కళ్యాణ్ చెప్తుంటే, తనూజ మధ్యలో దూరి “నువ్వు చెప్పడం కాదు నాకు. వచ్చిన నోటీస్ ఏంటంటే ఏదీ పాడవకుండా చూసుకోవాలని” అంది. దీనికి కళ్యాణ్ “బెండకాయ రేపు ఉదయం చేయించొచ్చు కదా. బెండకాయ రైస్‌తో తినొచ్చు. చపాతీలు, ఆలూ కావాలి” అని చెప్పాడు.
- తనూజ రెచ్చిపోవడం: వెంటనే తనూజ “ఏయ్ నువ్వ్ ఎక్స్‌ట్రాలు మాట్లాడకు కళ్యాణ్. ప్రతి దాంట్లో వేలు పెట్టడానికి వస్తున్నాడు. నువ్వు ఎవరు అడగటానికి” అంటూ ఓవరాక్షన్ చేసింది.
- కళ్యాణ్ సీరియస్: దీనికి కళ్యాణ్ సీరియస్ అయి “హౌస్‌మేట్‌ని.. ఎవరని అడుగుతావేంటి అర్థం కాదు. నీలాగ ఎవరూ బిహేవ్ చేయట్లేదు ఇక్కడ” అని అన్నాడు.
- వాగ్వాదం తీవ్రం: కళ్యాణ్, “ఒపీనియన్ ఉన్నప్పుడు చెప్తాం. చెప్పినప్పుడు విని నేర్చుకోవాలి. వినను నాకు నచ్చినట్లే చేస్తానంటే పనులు అవ్వవు ఇక్కడ” అని గట్టిగా చెప్పాడు. దీనికి తనూజ మరింత కోపంతో “ఎవరు నచ్చినట్లు చేయట్లేదు.. ఎవరూ నీకులాగ ఓవర్ చేయట్లేదు” అంటూ అరిచింది.
- దివ్య వర్సెస్ రీతూ: మరోవైపు, దివ్య, రీతూ మధ్య కూడా టీ కప్పుల విషయంలో గొడవ జరిగింది. డీమాన్ సుమన్ శెట్టికి టీ ఇస్తుంటే, అది కళ్యాణ్ కప్పు కదా అని దివ్య ప్రశ్నించింది. సుమన్, కళ్యాణ్ షేర్ చేసుకుంటున్నామని రీతూ చెప్పినా, దివ్య “నీ కప్పేది మరి హాఫ్ హాఫ్ తీసుకోండి” అంది. దీనికి రీతూ విసుగు చెంది “ప్రతిదాంట్లోకి ఎందుకు రావడం నాకు అర్థం కావట్లేదు” అంటూ చిరాకు పడింది.
మొత్తంగా, 54వ రోజు ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరగనున్నాయి.
Bigg Boss 9 Day 54 Promo
Trump Xi Summit 2025 : ట్రంప్-జి సమ్మిట్ 2025

