Eating While Using Phone మీరు కూడా భోజనం ప్లేట్ ముందు పెట్టుకుని ఫోన్ స్క్రోల్ చేస్తూ తింటుంటారా? ఇప్పుడు చాలా మందికి ఇది సాధారణ అలవాటు అయిపోయింది. రీల్స్ చూస్తూ, చాట్స్ చేస్తూ టైమ్ గడిచిపోతుంది కదా!

కానీ ఈ చిన్న అలవాటు మీ జీర్ణక్రియను నెమ్మదిగా పాడు చేస్తుందని తెలుసా? ఇది కేవలం నా మాట కాదు, శాస్త్రీయంగా నిరూపితమైన విషయం.
భోజన సమయంలో ఫోన్ ఎందుకు సమస్య?
మనం తినడం అంటే కేవలం కడుపు నింపుకోవడం మాత్రమే కాదు. ఆహారాన్ని చూడటం, వాసన చూడటం, రుచి చూడటం – ఇవన్నీ మెదడుకు సిగ్నల్స్ పంపి జీర్ణ రసాలు సిద్ధం చేస్తాయి. దీన్నే శాస్త్రంలో ‘సెఫాలిక్ ఫేజ్’ అంటారు. కానీ ఫోన్ చూస్తూ తింటే మెదడు ఆహారంపై దృష్టి పెట్టదు. ఫలితంగా నోట్లో లాలాజలం తక్కువగా విడుదలవుతుంది, ఆహారం సరిగా నవ్వడం జరగదు. పెద్ద ముద్దలుగా కడుపులోకి వెళ్తాయి.
శరీరంలో ఏమవుతుంది?
ఫోన్ స్క్రీన్ చూస్తుంటే మన శరీరం ‘రెస్ట్ అండ్ డైజెస్ట్’ మోడ్‌లోకి రాదు. బదులుగా స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే తిన్న తర్వాత ఉబ్బరం, గ్యాస్, బరువు అనిపించడం సాధారణం. ఇంకా, ఫోన్ చూస్తూ వంగి కూర్చుంటాం కదా – ఇది కడుపును ఒత్తిడి చేసి ఆమ్లం పైకి రావడానికి కారణమవుతుంది.
ఎక్కువ తినడం ఎందుకు జరుగుతుంది?
చాలా మంది గమనించే విషయం ఏమిటంటే, ఫోన్ చూస్తూ తింటే ప్లేట్ ఖాళీ అయినా తెలియదు. మెదడు నిండిన సిగ్నల్స్ సరిగా పంపదు. ఫలితం – అవసరం కంటే ఎక్కువ తినేస్తాం. అధ్యయనాలు చెబుతున్నాయి, స్క్రీన్ ముందు తింటే సగటున 25 శాతం ఎక్కువ కేలరీలు తీసుకుంటామని.
దీర్ఘకాలంలో ఏమవుతుంది?
ఈ అలవాటు కొనసాగితే ఊబకాయం, పోషకాల లోపం, జీర్ణవ్యవస్థ బలహీనం వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో ఇది మరీ డేంజర్ – పెరుగుదల మందగిస్తుంది, ఏకాగ్రత తగ్గుతుంది. నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఇలా కొనసాగితే దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు తప్పవు.
Eating While Using Phone ఇప్పుడు ఏం చేయాలి?
సులభమైన మార్పులతో ఇది సరిచేయవచ్చు. భోజనం సమయంలో ఫోన్‌ను దూరంగా పెట్టండి. ఆహారాన్ని నెమ్మదిగా నమలండి, రుచిని ఆస్వాదించండి. కుటుంబంతో కలిసి తింటే మరీ మంచిది – మాటలు, నవ్వులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజూ ఒక భోజనం అయినా స్క్రీన్ లేకుండా ప్రయత్నించండి, తేడా మీరే గమనిస్తారు.
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. ఈ చిన్న మార్పుతో పెద్ద తేడా తెచ్చుకోవచ్చు!
Coffee on Empty Stomach Effects – ఖాళీ కడుపుతో కాఫీ తాగితే శరీరానికి ఏమవుతుంది?
Gold Price Jan 4 2026 హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ జోరు…

