తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మెరుగైన, స్నేహపూర్వక సేవలు అందించే దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ఆదేశాల మేరకు, హైదరాబాద్‌లోని బండ్లగూడ బస్ డిపోలో ‘ప్రయాణికులకు స్వాగతం పలికే కార్యక్రమం’ (Passenger Welcoming Program) ప్రారంభమైంది.
ఈ కొత్త విధానంలో, బస్సు కండక్టర్లు ఇకపై ప్రతి ట్రిప్ ప్రారంభంలో ప్రయాణికులను ఆప్యాయంగా పలకరించి, బస్సులోకి ఆహ్వానిస్తారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించి, సంస్థ పట్ల సానుకూల వాతావరణాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.

కండక్టర్లు అమలు చేస్తున్న ఈ కొత్త విధానంపై ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆర్టీసీ సేవల్లో ఈ మార్పు పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తూ, డిపో సిబ్బందిని మరియు ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఇతర డిపోలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.
TGSRTC
Trump Xi Summit 2025 : ట్రంప్-జి సమ్మిట్ 2025
