Renault Duster 2026 India Launch భారతీయులకు ఎస్యూవీ అంటే మొదట గుర్తొచ్చే పేరు రెనాల్ట్ డస్టర్. ఒకప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా కనిపించే ఈ కారు, కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉండేవారు.

ఇప్పుడు 2026లో ఈ ఐకానిక్ మోడల్ ఆధునిక రూపంతో తిరిగి రాబోతోంది. ఈ రోజు (జనవరి 27, 2026) రిపబ్లిక్ డే సందర్భంగా రెనాల్ట్ దీన్ని అధికారికంగా ఆవిష్కరించింది.
ఏం జరిగింది? లాంచ్ ఎలా ఉంది?

రెనాల్ట్ ఈ కొత్త జనరేషన్ డస్టర్‌ను భారత్‌లో ఆవిష్కరించి, బుకింగ్స్ కూడా ప్రారంభించేసింది. కేవలం 21 వేల రూపాయల టోకెన్ అమౌంట్ చెల్లిస్తే సొంతం చేసుకోవచ్చు. ధరలు మార్చి మధ్యలో అధికారికంగా ప్రకటిస్తారు. టర్బో వేరియంట్ల డెలివరీలు మార్చి నుంచే మొదలవుతాయి, అయితే హైబ్రిడ్ మోడల్ మాత్రం దీపావళి 2026 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ధర రూ.10 లక్షల నుంచి మొదలయ్యే అవకాశం ఉందని అంచనాలు. Renault Duster 2026 India Launch
కొత్త డిజైన్ – గట్టిగా, ఆకర్షణీయంగా
పాత డస్టర్ రఫ్ అండ్ టఫ్ లుక్ ఇప్పుడు మరింత షార్ప్‌గా మారింది. ముందు భాగంలో కొత్త హెడ్లైట్లు, ఐబ్రో స్టైల్ LED DRLలు, సిల్వర్ ఫినిష్ బంపర్‌తో మొదటి జనరేషన్ గుర్తుండిపోయేలా చేశారు. సైడ్‌లో బ్లాక్ క్లాడింగ్, సి-పిల్లర్‌కు అటాచ్ అయిన రియర్ డోర్ హ్యాండిల్ ఉన్నాయి. వెనుకవైపు కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు కొత్త టచ్ ఇస్తున్నాయి. మొత్తంగా రోడ్ మీద ఈ కారు చూస్తే మళ్లీ పాత రోజులు గుర్తొస్తాయి, కానీ ఆధునికంగా!
ఇంటీరియర్, ఫీచర్స్ – లగ్జరీ టచ్
ఇంటీరియర్ చూస్తే ఇదే పాత డస్టరా అనిపించదు. డ్యూయల్ స్క్రీన్ సెటప్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ (వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే), 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ మరియు పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు – ఇవన్నీ ఈ సెగ్మెంట్లో టాప్ క్లాస్. అంబియంట్ లైటింగ్ కూడా ఉండటంతో రాత్రి డ్రైవ్‌లు మరింత ఎంజాయ్ అవుతాయి.
ఇంజన్ ఆప్షన్స్ – పవర్ఫుల్, ఎకానమికల్
మూడు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో (100 bhp), 1.3 లీటర్ టర్బో (160 bhp, 280 Nm టార్క్ – మాన్యువల్ లేదా DCT గేర్‌బాక్స్), మరియు హైలైట్ – 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (160 bhp, రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో). హైబ్రిడ్ వేరియంట్ మైలేజ్‌లో టాప్‌లో ఉంటుందని అంచనా.
మార్కెట్ రియాక్షన్ – అందరూ ఎక్సైట్మెంట్లోనే! Renault Duster 2026 India Launch
పాత డస్టర్ అభిమానులు ఈ కొత్త వెర్షన్ చూసి సోషల్ మీడియాలో ఎక్సైట్ అవుతున్నారు. “మళ్లీ డస్టర్ వచ్చేసింది, ఈసారి మరింత బెటర్” అంటూ కామెంట్స్ కురిస్తున్నాయి. కొత్త ఫీచర్స్, హైబ్రిడ్ ఆప్షన్‌తో మధ్యతరగతి ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది.
Follow On: facebook| twitter| whatsapp| instagram
2026 Tata Punch Facelift Best Value టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో బెస్ట్ వాల్యూ ఫర్