Nandamuri Balakrishna Out of Jailer 2 నందమూరి బాలకృష్ణ ‘జైలర్ 2’ నుంచి తప్పుకోవడానికి కారణం షెడ్యూల్ సమస్యలేనా? ఈ మెగా సీక్వెల్‌లో రజనీకాంత్‌తో ఫహాద్ ఫాజిల్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో నటించబోతున్నారని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
అయితే, తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘అఖండ 2’ షూటింగ్‌తో పాటు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే ఆయన ‘జైలర్ 2’కి డేట్స్ కేటాయించలేకపోయారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దీంతో, బాలకృష్ణ స్థానంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరు. గతంలో ఆయన రజనీకాంత్‌తో కలిసి ‘వెట్టయాన్’ అనే మూవీలో నటించారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘జైలర్ 2’ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రజనీకాంత్ మరోసారి యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు. ఈ సీక్వెల్‌లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ పాత్రలు కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫహాద్ ఫాజిల్ రాక ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రం ‘జైలర్’ మొదటి భాగం విజయాన్ని మించి కొత్త రికార్డులు సృష్టించాలనే లక్ష్యంతో రూపొందుతోంది.
Nandamuri Balakrishna Out of Jailer 2
Trump Xi Summit 2025 : ట్రంప్-జి సమ్మిట్ 2025
