ఓజీ’ (OG) సినిమాలో పవన్ కళ్యాణ్‌కు విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, తన తాజా చిత్రం ‘హక్’ (Haq) ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నటీనటుల సమయపాలన గురించి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, కొందరు నటులు సమయానికి రావడం కాదు కదా, అసలు షూటింగ్ సెట్స్‌కే రారని అన్నారు. అయితే, తన ‘హక్’ సహనటి యామీ గౌతమ్‌ను ప్రశంసిస్తూ, ఆమె చాలా ప్రొఫెషనల్ అని, తనలాగే సమయానికి సెట్స్‌కు వస్తుందని అన్నారు.
ఇమ్రాన్ హష్మీ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. ‘హక్’ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుండగా, ఇది షా బానో కేస్ స్ఫూర్తితో కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కింది.

Emraan Hashmi
Heavy Rain in Andhra Pradesh | తీవ్ర తుపాను మెుంథా | నేడు తీరం దాటే అవకాశం
