- బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా దివ్య ఎంపికైంది.
- కెప్టెన్సీ కోసం చివరి వరకూ పోటీ పడిన తనూజకి మరోసారి నిరాశ ఎదురైంది.
- దివ్యకు భరణి మద్దతు ఇచ్చారు.
- సీజన్-9లో ఈమె 8వ కెప్టెన్‌గా నిలిచింది.
Bigg Boss Telugu 9 బిగ్‌బాస్ హౌస్‌కి దివ్య కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది. ఈరోజు ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ చూపించారు. ఈ సీజన్ 9లో దివ్య 8వ కెప్టెన్. అయితే, గత వారం ఇమ్మానుయేల్ చేతిలో కెప్టెన్సీ మిస్ చేసుకున్న తనూజకి ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఈ వారం కూడా దివ్యతో పాటు చివరి వరకూ పోటీలో ఉన్న తనూజకి తగినంత మంది సపోర్ట్ లభించలేదు.
కెప్టెన్సీ టాస్క్:
8వ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా దివ్య, తనూజ, నిఖిల్, శ్రీనివాస్, భరణి నిలిచారు. వీరికి డ్యాన్సింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో ఒక్కొక్కరిని తొలగిస్తూ వెళ్లగా, చివరికి తనూజ-దివ్య మిగిలారు. అప్పుడు హౌస్‌మేట్స్ మద్దతు ఎవరికి ఎక్కువ ఉంటే వారు కెప్టెన్ అవుతారని బిగ్‌బాస్ ప్రకటించారు.

మద్దతు వివరాలు:
- తనూజకి సపోర్ట్ చేసినవారు: రీతూ, డీమాన్, కళ్యాణ్, మాధురి.
- దివ్యకి సపోర్ట్ చేసినవారు: ఇమ్మానుయేల్, సుమన్, సంజన, భరణి, గౌరవ్, శ్రీనివాస్.
దివ్యకి ఎక్కువ మంది మద్దతు లభించడంతో ఆమె 8వ కెప్టెన్ అయింది.
Bigg Boss Telugu 9 రేషన్ మేనేజర్‌గా తనూజ గొడవలు:
ఈ వారం తనూజకి టాస్కులు ఆడే అవకాశం దొరకనప్పటికీ, రేషన్ మేనేజర్‌గా ఉంటూ కుకింగ్ డిపార్ట్‌మెంట్‌తో, మిగిలిన హౌస్‌మేట్స్‌తో గొడవలు పడింది. సంజన, మాధురి, శ్రీజ, కళ్యాణ్, డీమాన్.. ఇలా చాలా మందితో ఆమెకి గొడవలు జరిగాయి. ఫుడ్ విషయంలో తనూజ మాట్లాడే తీరుపై హౌస్‌మేట్స్ కంప్లెయింట్ చేశారు. తనూజకు క్లోజ్‌గా ఉండే మాధురి కూడా ఈ వారం గొడవపడింది. మాధురి ఒక చపాతీ అదనంగా అడగగా, “తిరగనీ పర్లేదు పడిపోతే డాక్టర్‌ని పిలుస్తా” అని తనూజ బదులిచ్చింది.
మరోవైపు, దివ్య మాత్రం భరణి రీఎంట్రీతో పుల్ జోష్‌లో ఉంది. ఆమె భరణి కోసం ఒక టాస్క్ ఆడి గెలిపించింది. హౌస్‌మేట్స్‌తో గట్టిగానే గొడవలు కూడా పడింది. మొత్తానికి దివ్య కెప్టెన్ అయింది. మరి ఈ వారం రేషన్ మేనేజర్‌గా ఎవరిని పెడుతుందో చూడాలి. గతవారం కెప్టెన్‌గా ఉన్న ఇమ్ము తన వరకూ బాగానే డీల్ చేసినా, తనూజ మూలంగా హౌస్ రచ్చ రచ్చగా ఉంది. ఈ వారం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Bigg Boss Telugu 9
Bigg Boss 9 Day 54 Promo తనూజ vs కళ్యాణ్ ఫుడ్ ఫైట్
