బిగ్‌బాస్ 9 హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. తాజా ప్రోమోలో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ అయేషా జీనత్ తన మాటలతో అందరినీ ఆకట్టుకుంది. తనూజ గౌడ భరణి వెనకాల తిరగడం, బాండ్‌లపై సెటైర్లు వేస్తూ అయేషా హీట్ పెంచింది. అంతేకాదు, రీతూ డీమాన్‌ల రిలేషన్‌షిప్‌ని కూడా టార్గెట్ చేసింది. ఈ హీటెక్కిన నామినేషన్స్‌పై ఓ సారి చూద్దాం.
Bigg Boss 9 Telugu Promo హైలైట్స్:
- Bigg Boss 9 Telugu Promo బిగ్‌బాస్ 9 తెలుగు లేటెస్ట్ ప్రోమో
- తనూజ గౌడపై అయేషా జీనత్ సెటైర్లు
- రీతూ డీమాన్‌పైనా అయేషా విమర్శలు
Bigg Boss 9 Telugu Promo బిగ్‌బాస్ 9 తెలుగు ప్రోమో 2
“బాయ్‌ఫ్రెండ్-నాన్న అనుకుంటూ ఫినాలేకి పోతారా?” – తనూజ, రీతూలని ఏకిపారేసిన అయేషా
బిగ్‌బాస్ 9లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వచ్చిన అయేషా జీనత్ తన ఎనర్జీతో హౌస్‌ని షేక్ చేస్తోంది. ఆటలో ఎలా ఉంటుందో తెలియదు కానీ, మాటల్లో మాత్రం బుల్లెట్లలా ఫైర్ చేస్తోంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రీతూ-డీమాన్‌ల బంధంపై సెటైర్లు వేస్తూ వచ్చిన అయేషా, ఈ వారం నామినేషన్స్‌లో తనూజ గౌడని టార్గెట్ చేసింది.
తాజా ప్రోమోలో అయేషా బాల్‌ని సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ మొదట సంజనని నామినేట్ చేశాడు. “సంజన గారు, ఎక్కడైనా గొడవ స్టార్ట్ అయితే మీరు ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. అది ఎందుకు? గొడవని ఆపడానికి ట్రై చేయాలి కదా?” అంటూ సుమన్ యాక్ట్ చేసి చూపించాడు. దీనితో సంజనతో పాటు హౌస్‌మేట్స్ అందరూ నవ్వుకున్నారు.
తర్వాత సుమన్ తన రెండో నామినేషన్‌గా తనూజని ఎంచుకున్నాడు. “తనూజ గౌడ కొంచెం డ్రామాటిక్‌గా అనిపిస్తుంది. సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తోంది,” అని సుమన్ అన్నాడు. దీనికి తనూజ సమాధానంగా, “ప్రతి శుక్రవారం బట్టలు వస్తే డైనింగ్ టేబుల్‌పై కూర్చొని ఏడ్చేది మీరు కదా?” అని సెటైర్ వేసింది. “నేను ఏడ్చిన దానికంటే నీవు ఎక్కువ ఏడుస్తున్నావ్,” అని సుమన్ కౌంటర్ ఇచ్చాడు.
తనూజ వెటకారంగా, “అవునా? మీకు అలా అనిపిస్తుందా?” అని అంటే, సుమన్, “నాకు మాత్రమే కాదు, అందరికీ అలానే అనిపిస్తుంది,” అని గట్టిగా వాదించాడు. “వావ్, సుమన్ అన్నా, నీ నిజస్వరూపం బయటపడింది,” అని తనూజ స్పందించింది.
అయేషా సంజనని సేవ్ చేసి, తనూజని నామినేట్ చేసింది. ఈ సందర్భంగా అయేషా చెప్పిన పాయింట్లు బుల్లెట్లలా ఉన్నాయి. “సీరియల్ ఆపెయ్! మీ ఇన్‌ఫ్లుయెన్స్, ఫేవరిజం వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది. ఓపెన్‌గా చెప్పాలంటే, నీ వల్ల భరణి గారి గేమ్ కూడా పాడవుతోంది. స్టార్ మా సీరియల్స్‌లో ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇక్కడ అవసరం లేదు,” అంటూ అయేషా ఫైర్ అయింది.
తనూజ ప్రశ్నిస్తూ, “ప్రతిదానికీ భరణి సార్ నన్ను సపోర్ట్ చేశారా?” అని అడిగింది. అయేషా సూటిగా, “నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాన్న ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదని ఏడవలేదా?” అని కౌంటర్ ఇచ్చింది. “అఫ్‌కోర్స్, ఎవరికి వాళ్ల ఫేవరెట్స్ ఉంటారు, సపోర్ట్ చేసుకుంటారు,” అని తనూజ ఒప్పుకుంది. “అంటే నీకు ఇక్కడ ఫేవరిజం లేదని చెప్తున్నావా?” అని అయేషా మళ్లీ ప్రశ్నించింది.
తనూజ, “మేము డే 1 నుంచి క్లోజ్‌గా ఉన్నాం,” అని అనగానే, అయేషా, “అదే చెప్తున్నా, మీరు చాలా క్లోజ్‌గా ఉన్నారని!” అని ఇచ్చిపడేసింది. “ఇక్కడ బాయ్‌ఫ్రెండ్ లేదా నాన్న ఉంటే ఫైనల్ వరకూ వెళ్లొచ్చన్నట్లు ఉంది,” అంటూ అయేషా తనూజ, రీతూ ఇద్దరిపై సెటైర్లు వేసింది.
Bigg Boss 9 Telugu Promo
తాజా అప్‌డేట్స్ కోసం
లేటెస్ట్ వార్తల కోసం Telugumaitri ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి.
24k gold price today బంగారం రూ. 3,000, వెండి రూ. 2 లక్షలు దాటిన రికార్డు ధరలు…

