Amavasya సెప్టెంబర్ 21 ఆదివారం అమావాస్య – డబ్బు, సుఖశాంతి కోసం చేయాల్సిన పనులు
Amavasya ఈసారి సెప్టెంబర్ 21న వచ్చే అమావాస్య చాలా స్పెషల్. అది కూడా ఆదివారం రావడం వల్ల జ్యోతిషశాస్త్రం ప్రకారం ఫలితం డబుల్ అవుతుందంటారు. ఎందుకంటే అమావాస్య అంటే చంద్రుడు కనబడని రోజు, సూర్యుడి శక్తి మాత్రం పీక్‌లో ఉంటుంది. అందుకే సూర్యభగవానునికి పూజ చేస్తే ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం.
ఎందుకు ఈ అమావాస్య ముఖ్యమంటే?

ఇది పితృపక్షం మధ్యలో వస్తోంది. కాబట్టి పూర్వీకులకు పిండప్రధానం చేయడం, తర్పణాలు చేయడం వల్ల వారికి శాంతి కలుగుతుంది, మనకూ ఆశీర్వాదాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు. ఒకవేళ ఇంట్లో వరుసగా సమస్యలు వస్తున్నాయా? డబ్బు నిలవకపోతేనా? అయితే ఈ రోజు చేసే పరిహారాలు ఉపయోగపడతాయి అని విశ్వాసం.
చేయాల్సిన ముఖ్యమైన పనులు

- ఉదయాన్నే స్నానం – నది లేదా చెరువు దగ్గర స్నానం చేసి తిలతర్పణం చేయడం.
- సూర్యారాధన – ఒక గ్లాసు నీటిలో ఎర్ర పువ్వులు, బెల్లం, కుంకుమ వేసి సూర్యుని వైపు ఆర్ఘ్యం ఇవ్వడం.
- మంత్రాలు – “ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః” జపం చేయడం.
- దానం – నువ్వులు, గోధుమలు, ఎర్రని వస్త్రాలు, ప్రసాదం ఇవ్వడం.
ఆర్థిక ఇబ్బందులు తగ్గాలంటే
డబ్బు సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఇంట్లో కర్పూరం వేసి కాల్చాలి. నల్ల నువ్వులు లేదా ఎర్ర మిరపకాయలు తీసుకుని ఇంటి చుట్టూ మూడు సార్లు తిప్పి, వాటిని ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ తగ్గి, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని నమ్మకం.
చివరగా గుర్తుంచుకోండి
ఇది మొత్తం జ్యోతిష్యం, మత విశ్వాసాలపైనే ఆధారపడి ఉంటుంది. ఎవరికీ బలవంతం కాదు. నమ్మకం ఉన్నవాళ్లు ప్రయత్నించవచ్చు. కొందరికి ఇది మానసికంగా శాంతి ఇస్తుంది, మరికొందరికి భరోసా కలిగిస్తుంది.
Bathukamma Kanuka |ఉచిత చీరలతో మహిళలు
