Hyderabad Weather Report |వాతావరణం – వర్షం, ట్రాఫిక్, ట్రోలింగ్ అంతా మిక్స్
Hyderabad Weather Report, హో, మళ్లీ కొత్త ఎపిసోడ్ మొదలైంది. ఉదయం లేచి కిటికీ తెరిస్తే సూర్యుడు “హాయ్!

ఈ రోజు సూపర్ బ్రైట్ డే” అని ఫుల్ స్మైల్ ఇచ్చాడు. కాసేపటికి మబ్బులు సైలెంట్‌గా వస్తూ, “ఏమిట్రా… నువ్వే ఎక్కువా?” అని అడ్డుపడ్డాయి. గాలి కూడా మధ్యలోకి దూసుకువచ్చి, చొక్కా కాలర్ లాగినట్టు గట్టిగా వీచింది.చివరికి, ఎంట్రీకి రెడీగా నిలిచిన వర్షం, డ్రామా మామూలు కాదని నిరూపించింది. ఒక్కసారిగా షవర్ ఆన్ చేసి, బైక్ మీద వెళ్లేవాళ్లను “ఐస్ బకెట్ చాలెంజ్”లో పాల్గొన్నట్టే తడిపేసింది.
రోడ్ల సీన్:
ఇక ట్రాఫిక్ సంగతి చెప్పాలంటే, హైదరాబాద్కు ప్రత్యేక మూడ్. సిగ్నల్ దగ్గర కార్లు, బైక్‌లు స్టార్ట్-స్టాప్ డ్యాన్స్ చేస్తాయి. RTC బస్సులు మాత్రం “ఓహ్ నువ్వే కదా హడావిడి చేస్తున్నది” అన్నట్టుగా దారి మొత్తం కవర్ చేస్తాయి. పైగా వర్షం కారణంగా ఫుట్‌పాత్ మీద నడుస్తున్న వాళ్లు జిమ్నాస్టిక్ స్టెప్పులు వేయాల్సిందే.
సోషల్ మీడియా ఫీలింగ్స్:
ట్విట్టర్‌లో ఎవరైనా ఇలా పోస్టు చేస్తారు – “#HyderabadRain మనసు కడిగేస్తుంది”. ఇంకొకరు రెడీగా రిప్లై ఇస్తారు – “అవును, కానీ బట్టలూ కడిగేస్తుంది”. 😂
Heavy Rain in Telangana Today | తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు
