Rithu Chowdary బిగ్ బాస్ హౌస్‌లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి బిగ్ బాస్ కొత్త మలుపు ఇచ్చాడు. సాధారణంగా డైరెక్ట్ నామినేషన్లకు బదులుగా, హౌస్ మెంబర్లను నాలుగు జట్లుగా విభజించి ఒక ఆట ఆడించాడు. ఆ ఆటలో గెలిచిన జట్టు, ఓడిన జట్టు నుంచి ఒక సభ్యుడిని నామినేట్ చేయాలి అని నియమం పెట్టాడు. ఈ నేపథ్యంలో సుమన్ శెట్టి, రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర చర్చ జరిగింది.
Rithu Chowdary ముఖ్యాంశాలు:
- బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్లు
- రీతూ చౌదరిని నామినేట్ చేసిన సుమన్ శెట్టి
- రాముపై సంజనా వివాదాస్పద వ్యాఖ్యలు
బిగ్ బాస్ సీజన్ 9లో సుమన్ శెట్టి ఆట రోజురోజుకు మెరుగుపడుతోంది. ఇది ప్రేక్షకుల నుంచి హోస్ట్ నాగార్జున వరకు అందరూ గమనించారు. ఎలాంటి గొడవలకు దూరంగా ఉంటూ, తన పనిని తాను చేసుకుపోతూ, ఆటలలో హుందాగా పాల్గొంటున్నాడు సుమన్ శెట్టి. అయితే, గత వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున సుమన్‌కు ఒక సూచన చేశాడు. ఎప్పుడూ మెరుపులా కనిపించి మాయమవుతున్నావు, గట్టిగా మాట్లాడు అని సలహా ఇచ్చాడు.
Bigg Boss Telugu 9 Promo డీమాన్ పవన్‌పై సంజనా వివాదాస్పద కామెంట్లు…
