భక్తి / ధార్మికం

8 Powerful Lakshmi Mantras రోజూ 10 నిమిషాలు జపిస్తే సంపద, శ్రేయస్సు!

magzin magzin

8 Powerful Lakshmi Mantras లక్ష్మీదేవి – సంపద, శాంతి, అదృష్టం యొక్క దేవత

8 Powerful Lakshmi Mantras లక్ష్మీదేవి సంపద, సంతోషం, శ్రేయస్సు, శాంతి, అదృష్టాలకు అధిదేవత. ఆమెను మహాలక్ష్మిగా కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరించి, దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ చేస్తూ ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. లక్ష్మీ అంటే లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని విశ్వాసం. మానవ జీవనానికి 8 రకాల లక్ష్యాలు అవసరం, అందుకే అవి అష్టలక్ష్ముల రూపంలో అవతరించాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా, లక్ష్మీదేవిని స్తుతించే 8 శక్తివంతమైన మంత్రాలను తెలుసుకుందాం.

8 శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే భక్తి, శ్రద్ధలతో ఈ శక్తివంతమైన మంత్రాలను పఠించాలి. ఈ మంత్రాలను రోజూ 10 నిమిషాలు జపిస్తే ఆర్థిక స్థిరత్వం, ఆధ్యాత్మిక పరిపక్వత, మానసిక శాంతి కలుగుతాయని పురాణోక్తి. రోజూ పఠించలేని వారు శుక్రవారం, పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, దీపావళి వంటి పర్వదినాల్లో ఈ మంత్రాలను జపించడం శ్రేయస్కరం.

1. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః

ఈ మంత్రం సంపద, జ్ఞానం, శుభాలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి నమస్కారం చేసే సరళమైన, శక్తివంతమైన మంత్రం. రోజూ ఈ మంత్రాన్ని జపిస్తే ఆర్థిక సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి, సిరి సంపదలు, సంతోషం, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధి, జీవితంలో సమతుల్యత కలుగుతాయి.

2. ఓం హ్రీం శ్రీం కీం మహాలక్ష్మియే నమః

ఈ శక్తివంతమైన మంత్రం భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు, ప్రేమ, సామరస్యం, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈ మంత్రం జపించడం ద్వారా జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చు.

3. ఓం శ్రీం శ్రీ అయే నమః

సంతోషం, ఆనందం కోసం జపించే ఈ మంత్రం లక్ష్మీదేవిని సూచిస్తుంది. రోజూ ఈ మంత్రం జపిస్తే మానసిక ప్రశాంతత, సంతోషం, ఆనందం లభిస్తాయి.

4. ఓం మహాదేవ్యేచ విద్మహే.. విష్ణు పత్నేచ దీమహే.. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్‌

లక్ష్మీ గాయత్రీ మంత్రం అయిన ఈ మంత్రం ఆధ్యాత్మిక వృద్ధి, దైవ కృప, సంపద, అదృష్టం, సానుకూల శక్తి, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

5. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ.. అష్టలక్ష్మీ మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః

కుబేరుడు మరియు అష్టలక్ష్మీలను ప్రార్థించే ఈ మంత్రం, ఇంటిని సంపదతో నింపమని వేడుకుంటుంది. రోజూ జపిస్తే ఆర్థిక శ్రేయస్సు, ధన సమృద్ధి కలుగుతుంది.

6. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః

శుక్ర గ్రహం అనుగ్రహం, శాంతి, సంతోషం, సంపద కోసం ఈ శక్తివంతమైన బీజ మంత్రాన్ని పఠించాలి. ప్రతి శుక్రవారం 108 సార్లు జపిస్తే శుభ ఫలితాలు, ఆర్థిక అభివృద్ధి, అదృష్ట మార్పులు కలుగుతాయి. లక్ష్మీదేవి ఎదుట ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఈ మంత్రం జపిస్తే మరింత ఫలవంతం.

7. ఓం సర్వబాధా వినిర్ముక్తో.. ధన ధాన్య సుతాన్వితః మనుష్యో మత్‌ ప్రసాదేన భవిష్యతి న సంశయః ఓం

ఈ మంత్రం లక్ష్మీదేవి లేదా దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరుతుంది. దీనిని జపిస్తే అడ్డంకులు తొలగి, ధన ధాన్యాలు, సంతానం, శాంతి, సౌభాగ్యం లభిస్తాయి.

8. ఓం శ్రింగ్‌ హ్రింగ్‌ క్లింగ్‌ శ్రింగ్‌ సిద్ధ లక్ష్మయై నమః

సంపద, శ్రేయస్సు, సమృద్ధి కోసం ఈ శక్తివంతమైన మంత్రం లక్ష్మీదేవిని ప్రార్థిస్తుంది. రోజూ జపిస్తే ఆర్థిక సిద్ధి, ఐశ్వర్యం, విజయం కలుగుతాయి.

8 Powerful Lakshmi Mantras ముఖ్య గమనిక

ఈ కథనంలో పేర్కొన్న సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత నిర్ణయం. Telugumaitri ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు.

8 Powerful Lakshmi Mantras

Rohit Sharma At Hospital

Follow On : facebook twitter whatsapp instagram