Shani Trayodashi జాతకంలో శని కష్టాలు ఇస్తుందని వింటూనే భయపడుతుంటాం కదా? కానీ శనీశ్వరుడు న్యాయ దేవుడు, మన కర్మలకు తగిన ఫలితం ఇస్తాడు.
ఆయన్ని సంతృప్తి పరచుకుంటే జీవితంలో ఎన్నో సమస్యలు తీరిపోతాయి. అలాంటి గొప్ప అవకాశం ఈ జనవరి 31, 2026 శనివారం వచ్చేస్తోంది – శని త్రయోదశి!
శని త్రయోదశి అంటే ఏమిటి?

శనివారం రోజు త్రయోదశి తిథి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. ఈ రోజు శనీశ్వరుడికి చాలా ప్రీతికరం. పురాణాల ప్రకారం శని దేవుడు త్రయోదశి తిథినే జన్మించాడట. అందుకే ఈ రోజు ఆయన పూజ చేస్తే దోషాలు తొలగి అనుగ్రహం లభిస్తుంది.
2026 జనవరి శని త్రయోదశి ఎప్పుడు?
ఈసారి జనవరి 30 శుక్రవారం ఉదయం 11:09 గంటల నుంచి త్రయోదశి తిథి మొదలై, జనవరి 31 శనివారం ఉదయం 8:26 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం 31నే ఈ వ్రతం ఆచరిస్తారు. మీ ప్రాంత పంచాంగం ప్రకారం స్వల్ప మార్పులు ఉండొచ్చు, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి.
ఈ రోజు ఎందుకు ఇంత ప్రత్యేకం?
శనివారం విష్ణుమూర్తికి, త్రయోదశి శివుడికి ఇష్టమైన రోజు. రెండూ కలిసినప్పుడు శివ-కేశవుల అనుగ్రహం రెట్టింపు అవుతుంది. శని దోషాలు – ఏలినాటి శని, అష్టమ శని వంటివి బాధిస్తున్నవాళ్లకు ఈ రోజు పూజలు చేస్తే చాలా ఉపశమనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇలా ఆచరిస్తే శని దేవుడు ఆశీర్వాదం పూర్తిగా దక్కుతుంది
సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయండి. శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఎంతో శ్రేష్ఠం. కాకికి అన్నం పెట్టండి, నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు దానం చేయండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మర్చిపోకండి – శనివారం రావి చెట్టుపై లక్ష్మీనారాయణులు ఉంటారట! ఉపవాసం ఉంటే ఇంకా మంచిది.
ఈ రోజు పూజ చేస్తే ఏం జరుగుతుంది? Shani Trayodashi
ఆరోగ్యం, ధనం, కీర్తి – ఇవన్నీ పెరుగుతాయి. రుణ బాధలు, కోర్టు కేసులు, శత్రు సమస్యలు తగ్గుతాయి. అనవసర చిరాకులు, దురదృష్టం తొలగిపోతాయి. ముఖ్యంగా శని దోషం వల్ల ఇబ్బంది పడుతున్నవాళ్లకు ఈ రోజు ఒక్కటే చాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది.
మీరు కూడా ఈ శని త్రయోదశి రోజు పూజలు చేసి శనీశ్వరుడి అనుగ్రహం పొందండి. మీ అనుభవాలు కామెంట్లలో షేర్ చేయండి!
Skoda Kushaq Classic Plus Features స్కోడా కుషాక్ క్లాసిక్ ప్లస్ బేస్ వేరియంట్లో


























